హైదరాబాద్ లో క్రిస్మస్ వేడుకలకు హాజరు అయిన సీఎం కెసిఆర్

ముఖ్యాంశాలు

  • లాల్ బహదూర్ స్టేడియం లో క్రిస్మస్ వేడుకలు.
  • క్రిస్టియన్స్ కు క్రిస్మస్ కానుకలు అందచేసిన సీఎం కెసిఆర్.
  • ప్రభుత్వం అన్ని మతాలను గౌరవిస్తుంది: సీఎం కెసిఆర్
  • తెరాస ప్రభుత్వం అధికారికంగా క్రిస్టియన్స్ కు విందు.
  • హైదరాబాద్ లో క్రిస్టియన్ భవన్ నిర్మిస్తాం: కెసిఆర్
  • మరో రెండు ఏళ్లలో ఇరిగేషన్ ప్రాజెక్ట్ లు పూర్తిఅవుతాయి.
  • అందరి దీవెనలతో తెరాస కు మళ్ళీ అధికారము.

దేశంలో క్రిస్మస్ వేడుకలు అధికారికంగా నిర్వహిస్తున్న రాష్ట్రం తెలంగాణ.

ఇటీవల హైదరాబాద్ లో జరిగిన క్క్రిస్మస్ వేడుకలకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కెసిఆర్ గారు పాల్గొన్నారు. ఈ సభ లో కెసిఆర్ మాట్లాడుతూ… ఒక తెలంగాణ రాష్ట్రము లోనే మైనారిటీ వెల్ఫేర్ కొరకు మా తెలంగాణ ప్రభుత్వం 2,000 కోట్లు కేటాయిచింది.క్రిస్టియన్ విద్యార్థులు, విదేశాలకు వెళ్లే వాళ్లకు ఒక 60 మందికి తల 20 లక్షలు Dr. BR అంబెద్ఖర్ ఓవర్ సీస్ కింద స్కాలర్ షిప్ లు మంజూరు చేయడం జరిగింది. మైనారిటీ రెసిడెంటిల్ స్కూల్ చాలా గొప్ప ఫలితాలు ఇవ్వబోతున్నాయి అని కెసిఆర్ గారు తెలిపారు. ఇతర రాష్ట్రాల మంత్రులు మరియు ముఖ్య మంత్రులు, ఇతర అధికారులు కూడా తెలంగాణ లోని మైనారిటీ స్కూల్ యొక్క ప్రాముఖ్యత తెలుసుకున్నారు. రాబోయే 1 నుండి 2 సంవత్సరాలలో ఇరిగేషన్ ప్రాజెక్ట్ లు అన్ని పూర్తి చేస్తాం అని తెలిపారు. తెలంగాణ లో ఒక 1 కోటి ఎకరాలకు నీటిని అందచేస్తాం అని తెలిపారు.

Like this Article? Subscribe to Our Poyekalam Alerts!

Leave a Reply

avatar
  Subscribe  
Notify of