వాట్సాప్ గోల్డ్! యూజర్స్ తస్మాత్ జాగ్రత్త !

వాట్సాప్ గోల్డ్ అంటూ ఓ లింక్ ఫోన్ కు రాగానే టక్కున దాన్ని ఓపెన్ చేసి వాట్సాప్ ను గోల్డెన్ ఇన్స్టాల్ చేసుకుని అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. కానీ ఈ వాట్సాప్ గోల్డ్ అనేది ఒక వైరస్.ఒక వేళా గనక మీ ఫోన్ కి ఇలాంటి మెసేజ్ వస్తే లేక వాట్సాప్ లో వస్తే దాన్ని ఇన్స్టాల్ చేసుకోవద్దు. ఎందుకంటె వాట్సాప్ గోల్డ్ అనే యాప్ ఒక వైరస్. మీరు గనక ఈ యాప్ మీ ఫోన్ లో ఇన్స్టాల్ చేసుకుంటే మీ ఫోన్ లో ఉన్న క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు వివరాలు ఇంకా కాంటాక్ట్ ఫోన్ నంబర్స్, మీ పర్సనల్ వివరాలు హ్యాక్ కి గురిఅవుతాయి. మీ వివరాలు అన్ని సైబర్ నేరగాళ్లకు చేతుల్లోకి వెళతాయి.

ఎప్పుడైనా సరే ఎటువంటి అప్ డేట్ అయినా వాట్సాప్ నేరుగా యాప్ స్టోర్ నుండి విడుదల చేస్తుంది. వాట్సాప్ వాడేవారు కూడా ఇటువంటి హానికరమైన వాట్సాప్ గోల్డ్ ని మెసేజ్ రూపంలో ఎవరికీ పంపించవద్దు.ఒక వేళా వాట్సాప్ గోల్డ్ లాంటి లింక్స్ వచ్చిన కూడా వాటిని క్లిక్ చేయకండి.మీకు ఇలాంటి వాటి నుండి రక్షణ కావాలి అంటే యాంటి వైరస్ ఆప్ ఇన్స్టాల్ చేసుకోండి.
చాలా మంది ఇలాంటి లింక్ లను తెలియకుండా ఇతరులకు పంపుతున్నారు.కేవలం వాట్సాప్ యొక్క పేరును ఉపయోగించుకొని సైబర్ నేరగాళ్లు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు. వాట్సాప్ గోల్డ్ ఫీచర్ అనేది ఒక పెద్ద స్కామ్. ఇటువంటి ఆప్ ని మీ ఫోన్ లేక కంప్యూటర్ లో ఇన్స్టాల్ చేసుకోవద్దు అని నిపుణులు చెబుతూ ఉన్నారు.

 

వాట్సాప్ ఈ ఏడాది 4 కొత్త ఫీచర్స్ ని ప్రవేశపెట్టబోతుంది.

కాన్సెక్యూటివ్ వాయిస్ మెసేజ్:

ఈ ఫీచర్ ద్వారా యూజర్స్ వాట్సాప్ మెసేజీని యూజర్ తన మొబైల్ లో ఆటోమేటిక్ గా వినవచ్చు.దాన్ని ట్యాప్ చేస్తే అది ఆటోమేటిక్ గా వాయిస్ ని వినిపిస్తుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ టెస్టింగ్ దశలో ఉంది.బీటా వెర్షన్ లో ఇది అందుబాటులో ఉంది.

డార్క్ మోడ్:

వాట్సాప్ ఈ నూతన సంవత్సరం జనవరి లో లాంచ్ చేసే అవకాశం ఉంది.ఈ ఫీచర్ ద్వారా వాట్సాప్ యూజర్స్ కి ఎక్కువ మేలు జరుగుతుంది. లో లైట్ కండిషన్ లోకిడ్స్  కూడా ఈ ఫీచర్ చాలా బాగా పనిచేస్తుంది. యూజర్స్ కంటి సమస్య లకు కొంత మేలు చేయనుంది.

కాంటాక్ట్స్ ర్యాంకింగ్ :

ఈ ఫీచర్ ద్వారా మీరు వాట్సాప్ మెసేజ్ చేసే వారు ఎంత రాంక్ లో ఉన్నారు అని తెలుస్తుంది. ఈ ఫీచర్ ఈ యేడాది చివరగా వచ్చే అవకాశం ఉంది.

మీడియా ప్రివ్యూ:

ఈ మీడియా ఫీచర్ ద్వారా యూజర్స్ వాట్సాప్ మెసేజ్ ఓపెన్ చేయకుండానే, ఇతరులు పంపిన ఫొటోస్, వీడియోస్, ఆడియో లాంటివి వరుస క్రమంలో చూడవచ్చు.

Like this Article? Subscribe to Our Poyekalam Alerts!

Leave a Reply

avatar
  Subscribe  
Notify of