రోబో 2.0 సినిమా ఆన్ లైన్ లో,ఒక సెకను కి 16 టికెట్స్ అమ్మిన ”బుక్ మై షో”

  1. 1780 సినిమాల టికెట్స్ అమ్మి రికార్డు సృష్టించిన ”బుక్ మై షో”
  2. 2018 లో అమ్ముడుఅయిన టికెట్స్ లో 45 శాతం ప్రాంతీయ చిత్రాలు హవా.
  3. అందులో తమిళ్ , తెలుగు చిత్రాల వాటా 73 శాతం.
  4. రోబో 2.0 తర్వాత స్థానంలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకునే నటించిన ”పద్మవత్”.

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన రోబో 2.0 చిత్రం మరో సరికొత్త రికార్డు ను సృష్టించింది. ప్రముఖ ఆన్ లైన్ టికెట్ బుకింగ్ యాప్ బుక్ మై షో తెలిపిన వివరాల ప్రకారం… ఈ ఏడాదిలో యాప్ ద్వారా మొత్తం 1780 సినిమాలకు సంబదించిన టికెట్స్ అమ్ముడుపోయాయి.అందులో అత్యధికంగా 2.0 సినిమా టికెట్స్ అమ్ముడుపోయాయట. సెకను కి 16 టికెట్స్ చొప్పున విక్రయించినట్టు బుక్ మై షో ఇటీవల తెలిపింది.2018 లో ఏ సినిమాకి దక్కని రికార్డు రోబో 2.0 సొంతం చేసుకోవడం విశేషం. ఆ తరువాత ఇంతటి స్థాయి లో రికార్డ్స్ సృష్టించిన చిత్రం బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకునే నటించిన ”పద్మవత్”. ఇక ఏడాదిలో ఎక్కువ మందిని ఆకట్టుకున్నవి డ్రామా ఆధారిత చిత్రాలు ఎక్కువగా ఉన్నాయి. యాక్షన్, థ్రిల్లర్ , రొమాంటిక్ చిత్రాలపై ఈ సారి ప్రేక్షకులు ఆసక్తి చూపలేదు. ఈ యాప్ లో ఎక్కువగా హిందీ సినిమా టికెట్స్ అమ్ముడుఅయ్యాయి. ఆ తరవాత తెలుగు, ఆంగ్ల సినిమాలు ఉన్నాయి.ప్రాంతీయ సినిమాలపై ప్రేక్షకులు ఆసక్తి పెరిగింది. 2018 లో అమ్ముడుఅయిన టికెట్స్ లో 45 శాతం ప్రాంతీయ చిత్రాలు కావడం విశేషం.

తమిళ్ , తెలుగు చిత్రాల వాటా 73 శాతం.మలయాళం , కన్నడ సినిమాలకు ఆధరణ పెరిగింది. ఈ ఏడాది సినిమా లే కాదు, లైవ్ షో లకు కూడా మంచి ఆదరణ లభించింది.రోబో 2.0, సంజు లాంటి సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ప్రేక్షకులను ఫిదా చేసాయి.మరో పక్క అంతర్జాతీయ లైవ్ షోలు కూడా ప్రేక్షకులను ఎంత గానో ఆకర్షించాయి అని ” బుక్ మై షో ” సీఈఓ, వ్యవస్థాపకుడు ఆశిష్ హేమరజని వెల్లడించారు.

Like this Article? Subscribe to Our Poyekalam Alerts!

Leave a Reply

avatar
  Subscribe  
Notify of