భారత్ లో ఐఫోన్ల తయారీ!

భారత్ లో ఐఫోన్ల అసెంబ్లింగ్ ను యాపిల్ త్వరలో ప్రారంభించే అవకాశం ఉంది. తమిళనాడు లోని శ్రీ పెరంబదూర్ లో ఉన్న ఫ్యాక్స్ కాన్ ప్లాంట్ లో ఐఫోన్ల అసెంబ్లింగ్ ఉత్పత్తి జరగనుంది. ఈ ఏడాది లోనే పనులు మొదలుకావొచ్చు అని సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది. ప్రధానంగా ఐఫోన్-x శ్రేణి ఫోన్లు లాంటి అత్యంత ఖరీదయిన మోడల్స్ ని ఫ్యాక్స్ కాన్ ప్లాంట్ లో అసెంబ్లింగ్ చేయనుందని కంపెనీ వర్గాలు తెలిపాయి.

ఈ పరిమాణం అనంతరం భారత్ లో యాపిల్ వ్యాపారం మరో కొత్త శిఖరానికి చేరుకునే అవకాశం ఉంది.ఐఫోన్ల తయారీ నిమిత్తం ప్లాంట్ సామర్ధ్యంని విస్తరించేందుకు రూ. 2500 కోట్లు ఫ్యాక్స్ కాన్ పెట్టుబడులుగా పెడుతుంది అని తమిళనాడు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి ఎం.సి సంపత్ తెలిపారు. ఈ ప్రక్రియ లో 25 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

ఇప్పటికే శ్రీ పెరంబదూర్ ప్లాంట్ లో షెయోమి మోడల్స్ ని కూడా ఫ్యాక్స్ కాన్ తయారుచేస్తుంది.

 

Like this Article? Subscribe to Our Poyekalam Alerts!

Leave a Reply

avatar
  Subscribe  
Notify of