తెలంగాణ పంచాయతీ ఎన్నికలు – 2019 జనవరి 19.

తెలంగాణ పంచాయతీ ఎన్నికలకు రిజర్వేషన్ ఖరారు అయ్యాయి. ఈ సారి షెడ్యూల్ రిజర్వుడ్ పంచాయతీలు భారీగా పెరిగాయి. ST లకు 1865 పంచాయతీలకి, Scheduled Castes (SC) 2113 పంచాయతీలు, బి సి లకు 2,345 పంచాయతీలను ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ మొత్తంగా 12,751 పంచాయతీల ఎన్నికలకు రంగం సిద్ధం అయినది. మొత్తం పంచాయతీ లో 50 శాతం మహిళలకు,100 శాతం గిరిజనులున్న పంచాయితీలకు ST వారికే అవకాశం ఇచ్చారు.

  • 100 శాతం గిరిజనులు ఉన్న పంచాయతీలకు ST లకు ఖరారు.
  • మహిళలకు 50 శాతం రిజర్వేషన్స్.
  • భారీగా పెరిగిన SC రిజర్వుడ్ పంచాయతీలు.కొత్త చట్టంలో పొందుపరిచిన విధంగా పంచాయతీల జనాభా ప్రాతిపదికన 12,751 పంచాయతీలలో మొత్తం 1,13,380 వార్డులు ఏర్పాటవుతున్నాయి. ఓటర్ల జాబితాను ముద్రించిన 15 రోజుల్లో బిసి ఓటర్ల గణనను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు అందాయి. ఫలితంగా ఈ ప్రక్రియ కూడా అనుకున్న సమయంలోనే పూర్తి అవుతుందని అధికారులు చెబుతున్నారు. అనంతరం వారం రోజుల్లో రిజర్వేషన్లను ఖరారు చేయాలని నిర్ణయించారు.

తెలంగాణ పంచాయతీ ఎన్నికలు – 2019 జనవరి 19.

ఇప్పటి వరకు అధికారులు ఈ విధమైన కార్యాచరణను రూపొందించుకుని ముందుకు పోతున్నారు. ఈ కార్యాచరణ అమలు కాస్తా అటూ ఇటూ అయినా కూడా జూన్ రెండో వారం ముగిసే లోపే పూర్తవుతుందని, అనంతరం ప్రభుత్వానికి పూర్తి వివరాలు అందచేస్తామని అధికారులు చెబుతున్నారు. ఎన్నికల నిర్వహణ అంశం ప్రభుత్వం తేలుస్తుందని, ఈలోగా ఇతర ఏర్పాట్లను పూర్తి చేస్తామని, ఇది వరకే కొంత ప్రారంభమై ముందుకు నడుస్తోందని చెప్పారు. ఎన్నికల నిర్వహణకు జిల్లా, మండల, గ్రామ పంచాయతీ వారీగా అవసరమైన అదనపు సిబ్బంది జాబితాను సైతం పంచాయతీరాజ్ అధికారులు సిద్ధం చేసి మంజూరి కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఆమోదం పొంది రాగానే సిబ్బంది నియామకాన్ని చకచక పూర్తి చేస్తామంటున్నారు. అవసరమైన బ్యాలట్ పేపర్ల ముద్రణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఈ సారి మూడు గుర్తులు, అయిదు గుర్తులు ఉన్న బ్యాలట పేపర్ల సంఖ్య అధికంగా అవసరమవుతుందని అధికారులు భావిస్తున్నారు. అందుకు అనుగుణంగా వాటి ముద్రణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. పంచాయతీలు, వార్డుల జాబితా ఎన్నికల సంఘానికి చేరినందున ఎన్నికల కోసం పంచాయతీరాజ్ శాఖ చేయాల్సిన ఏర్పాట్ల జాబితాను సిద్ధం చేసే పనిలో పడ్డారు. ఒకటి రెండు రోజుల్లో ఈ జాబితా రాగానే పంచాయతీ అధికారులు వాటిని ఎన్నికల సంఘానికి సమకూర్చే పనిలో పడనున్నారు. ఇప్పటికే ఎన్నికల సంఘం ముందస్తుగా కొన్ని ఏర్పాట్లను చేసుకుంది. అవసరమైన బ్యాలట్ బాక్స్‌ల సేకరణను పూర్తి చేసింది. కర్ణాటక నుంచి 40 వేలు, మహారాష్ట్ర నుంచి 33వేలు బ్యాలెట్ బాక్స్‌లు తెప్పించారు.
దీంతో మొత్తం 98వేల బ్యాలెట్ బాక్స్‌లను ఎన్నికల సంఘం సమకూర్చుకుంది.

పంచాయతీ ఎన్నికలు ఎలాంటి అవాంతరాలు ( సిబ్బంది, భద్రతా సిబ్బంది కొరత వంటి ఇబ్బందులు తలెత్తకుండా) లేకుండా ప్రశాంతంగా జరపడానికి రెండు లేదా మూడు విడతల్లో నిర్వహించాలని ఎన్నికల సంఘం భావిస్తోంది. ఇలా నిర్వహించడం వల్ల బ్యాలెట్ బాక్స్‌ల కొరతను కూడా అధిగమించవచ్చని ఎన్నికల సంఘం భావిస్తోంది. బ్యాలట్ బాక్స్‌లకు ఉపయోగించే 1,55,000కు పేపర్ సీల్, ఓటు వేసిన వెంటనే ఓటర్ వేలుపై మార్క్ పెట్టేందుకు ఉపయోగించే ఇండలబుల్ ఇంక్ బాటిళ్లను 5 లక్షలు ఆర్డర్ ఇచ్చారు.

Like this Article? Subscribe to Our Poyekalam Alerts!

Leave a Reply

avatar
  Subscribe  
Notify of