తెలంగాణ పంచాయతీ అంతా ఇక వెబ్ సైట్ లోనే!

పంచాయతీ ఎన్నికలు త్వరలో జరగబోతూన్న నేపధ్యం లో పల్లెల్లో హడావుడి పెరిగింది. సర్పంచ్ పదవికి నామినేషన్ వేసేదెవరు… ఉపసంహరించుకునే వారెవరు, ఇంకా తుది పోరులో నిలిచేదెవరు మరియు అర్హతలేంటి.. ఇప్పుడు ఇలాంటి విషయాలు అన్నిటిని ఆన్ లైన్ లో తెలుసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఒక వెబ్ సైట్ విడుదల చేసింది. అదే (tsec.gov.in). ఈ సైట్ లో వెళితే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి.

సర్పంచ్ పోటీ కి అర్హుల కాదా…..

1. సర్పంచ్ గా పోటీ చేసే వారి కోసం ప్రత్యేకంగా కాండిడేట్ పోర్టల్ ని ఏర్పాటు చేసారు.
2. అభ్యర్థులు అనుసరించిలిసిన రూల్స్ ఫై కరదీపిక ఉంటుంది.
3. పోలింగ్ కేంద్రలా వారీగా ఓటర్లు జాబితా సైతం మీకు లభిస్తుంది.
4. అన్నిటికన్నా గత ఎన్నికల్లో చేసిన ఖర్చును వెల్లడించ కుండా అనర్హత కి గురైన వారి వివరాలు కూడా ఉంటాయి.
5. నామినేషన్ కూడా ఆన్ లైన్ లో పూర్తి చేసి, ప్రింట్ తీసి సంతకం చేసి ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పిస్తే సరిపోతుంది.

ఆన్ లైన్ లో ఓటర్ స్లిప్ లా పంపిణి…..

1. ఓటర్ ఆన్ లైన్ లో ఓటర్ స్లిప్ లను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
2. గ్రామంలో గత ఎన్నికల్లో పోటీ చేసిన ప్రజా ప్రతినిదుల వివరాలు, ప్రస్తుతం బరి లో ఉన్న వారి సమాచారం కూడా వెబ్ సైట్ లో చూడవచ్చు.
3. అభ్యర్థులు సమర్పించిన అఫిడట్లు లను కూడా ఇందులో అప్ లోడ్ చేయనున్నారు. ప్రజలకు అవసరమైన సమాచారం మొత్తం కూడా ఈ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచామని ఎన్నికల అధికారులు తెలిపారు.
4. ఎన్నికలు ముగిసిన రోజు ఫలితాలు సైతం ఈ వెబ్ సైట్ లో వుంచుతాము అని తెలిపారు.

ఎన్నికల అధికారులకు కూడా ఉపయోగమే…..

  • ఎన్నికలు విధులు నిర్వహించే అధికారులు, సిబ్బంది కోసం ప్రత్యేకంగా ఒక పోర్టల్ ని ఏర్పాటు చేసారు.
  •  పంచాయతీ ఎన్నికల్లో అధికారులు ఏ విధంగా తమ వూహ్యాలు అనుసారించాలి అని పొందుపరిచారు.
  • ఎన్నికల వ్యయం మరియు అన్ని ఇతర రిపోర్ట్ లను కూడా ఈ ప్రత్యేక వెబ్ సైట్ లో పొందుపర్చారు.

Like this Article? Subscribe to Our Poyekalam Alerts!

Leave a Reply

avatar
  Subscribe  
Notify of