రాష్ట్ర ముఖ్యమంత్రిగా టీఆర్‌ఎస్ శాసనసభాపక్ష నేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గురువారం మధ్యాహ్నం 1.25 గంటలకు ప్రమాణం స్వీకరించనున్నారు. ఆయనతోపాటు ఒకరు లేదా ఇద్దరు మంత్రులుగా ప్రమాణంచేసే అవకాశం ఉంది. తర్వాత వారంపదిరోజుల్లో పూర్తిస్థాయి మంత్రివర్గం ఏర్పాటవుతుందని తెలంగాణభవన్‌లో బుధవారం జరిగిన టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం అనంతరం కేసీఆర్ స్వయంగా మీడియాకు తెలిపారు. కేసీఆర్ సీఎం బాధ్యతలు చేపట్టనుండటం ఇది రెండోసారి. కేసీఆర్ ప్రమాణస్వీకారానికి రాజ్‌భవన్‌లో ఏర్పాట్లుచేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో 88 స్థానాల్లో గెలిచి, స్పష్టమైన మెజార్టీ సాధించిన టీఆర్‌ఎస్‌ను ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ నరసింహన్ ఆహ్వానించారు. అంతకుముందు రాష్ట్ర సీఈవో రజత్‌కుమార్ గవర్నర్‌ను కలిసి రాష్ట్రంలో ఎన్నికైన ఎమ్మెల్యేల వివరాలను అందించారు. ఎన్నికల కమిషన్ గెజిట్‌ను గవర్నర్ ఆమోదించారు. ఇదేక్రమంలో ప్రస్తుత ఆపద్ధర్మ సీఎంగా కేసీఆర్, ఆయన మంత్రుల రాజీనామాలను ఆమోదించిన గవర్నర్.. తదుపరి ప్రభుత్వం ఏర్పడేవరకు బాధ్యతల్లో కొనసాగాల్సిందిగా కేసీఆర్‌ను కోరారు. అనంతరం కొత్త అసెంబ్లీ ఏర్పాటుకు నోటిఫికేషన్ జారీచేశారు. ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్‌కు చెందిన 12 మంది ఎమ్మెల్యేలు గవర్నర్‌ను కలిసి, కేసీఆర్‌ను టీఆర్‌ఎస్‌ఎల్పీ నాయకుడిగా ఎన్నుకున్నట్టు తెలియజేస్తూ తీర్మాన ప్రతిని అందజేశారు. గవర్నర్‌వద్దకు వెళ్లినవారిలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, లకా్ష్మరెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, శ్రీనివాస్‌గౌడ్, గొంగిడి సునీత, పద్మాదేవేందర్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, కాలె యాదయ్య, రవీందర్, రేఖానాయక్ తదితరులున్నారు.

గురువారం మంచి ముహూర్తం ఉండటంతో కేసీఆర్ ప్రమాణం చేస్తున్నారు. ఇంత తక్కువ సమయంలో కేబినెట్ కూర్పు కుదరకపోవడంతో ఆయన ఒక్కరే ప్రమాణ స్వీకారం చేయాలని నిర్ణయించారు. కొత్తగా ఎంపికైన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల సమావేశం బుధవారం తెలంగాణ భవన్‌లో జరిగింది. ఈ సమావేశంలో టీఆర్ఎస్ శాసనసభాపక్ష నేతగా కేసీఆర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. టీఆర్ఎస్‌ఎల్పీ నేతగా కేసీఆర్‌ను ఎన్నుకునే తీర్మానాన్ని ఆలేరు ఎమ్మెల్యే గొంగడి సునీత ప్రవేశపెట్టారు. ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ బలపరిచారు. అనంతరం టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించారు.

అతిత్వరలో శాసనసభ సమావేశం కానున్నది. కొత్త సభ్యులతో ప్రొటెం స్పీకర్ ప్రమాణం చేయిస్తారు. తాజాగా ఎన్నికైన ఎమ్మెల్యేల్లో సీనియర్ సభ్యులుగా కేసీఆర్, ఎర్రబెల్లి దయాకర్, రెడ్యానాయక్ ఉన్నారు. ఎర్రబెల్లి, లేదా రెడ్యానాయక్‌లలో ఒకరు ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరించే అవకాశం ఉంది. స్పీకర్ ఎన్నిక కార్యక్రమాన్ని కూడా ప్రొటెం స్పీకర్ నిర్వహిస్తారు.

తెరాస అధినేత కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం:

cabinet ministers list:

1. Kalvakuntla Chandrashekar Rao (KCR) (Gajwel) is
2. Guntakandla Jagadish Reddy (Suryapet)
3. Jogu Ramanna (Adilabad)
4. Kalvakuntla Taraka Rama Rao (Sirchilla)
5. Patnam Mahender Reddy (Tandur)
6. Pocharam Srinivas Reddy (Parige) (Banswada)
7. Thanneeru Harish Rao (Siddipet)
8. T Padma Rao (Secundrabad)
9. Charlakola Laxma Reddy (Jadcherla)
10. Chandulal Azmeera (Mulug)
11. Jupally Krishna Rao (Kollapur)
12. Tummala Nageswar Rao (Palair)
13. Allola Indrakaran Reddy (Nirmal)
14. Talasani Srinivas Yadav (Sanath Nagar)

 

Like this Article? Subscribe to Our Poyekalam Alerts!

Leave a Reply

avatar
  Subscribe  
Notify of