టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా సోమవారం బాధ్యతలు స్వీకరించనున్న కేటీఆర్:

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు తారక రామారావుకు ఎంతో కీలకమైన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని కట్టబెట్టారు.రాష్ట్ర ప్రజలు టీఆర్‌ఎస్‌పై విశ్వాసంతో రెండోవిడుత అధికారం అప్పగించిన నేపథ్యంలో ప్రభుత్వపరంగా అత్యంత కీలకమైన నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తిచేయాల్సిన కర్తవ్యాలు, ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలుచేయాల్సిన బాధ్యతలు కేసీఆర్‌పై ఉన్నాయి. మరోవైపు దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు తీసుకురావడానికి జాతీయ రాజకీయాలపై దృష్టిపెట్టాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు. దీనివల్ల తరచూ ఢిల్లీ సహా వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సి ఉంటుంది.

వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాతో పార్టీలో అందరికంటె కీలకమైన పదవిని దక్కించుకున్న కేటీఆర్ కు ఇక కేసీఆర్ కేబినెట్ లో మంత్రిపదవి దక్కదనే ప్రచారం ఊపందుకుంటోంది

వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గం తొలిసారి శనివారం (డిసెంబర్ 15న) సమావేశమైంది. ఎన్నికల ఫలితాలపై స్పందన, పార్టీ సంస్థాగత నిర్మాణం, ఇతర రాజకీయాంశాలపై పార్టీ నేతలతో కేటీఆర్ చర్చిస్తున్నారు. ఇప్పటివరకూ ఉమ్మడి జిల్లా ప్రతిపాదికన పార్టీ కమిటీలు కొనసాగుతుండగా, కొత్త జిల్లాల ప్రకారం పార్టీ కమిటీలు వేయాల్సిన అవసరం ఉందా అనే అంశాలపై చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది.

KT Rama Rao will take charge as the working president of the TRS at Telangana Bhavan on December 17th Monday 2018. KTR is nominated as Working president by the Telangana chief minister KCR garu on Friday.

దానం నాగేందర్ మాట్లాడుతూ:

యువ నాయకుడు కల్వకుంట్ల తారక రామ రావు గారిని వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించి నందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి హృదయ పూర్వక నమస్కారం తెలియజేస్తున్న అని ఖైరతాబాద్ ఎంల్ఏ దానం నాగేందర్ గారు తెలిపారు. అదే విధంగా ఈ రోజు జాతీయ స్థాయి లో ఫెడరల్ ఫ్రంట్ లో సీఎం కెసిఆర్ గారు చాలా గొప్ప నిర్ణయం తీసుకున్ నారు.ఇప్పటికే కేటీర్ గారు హైదరాబాద్ మరియు తెలంగాణ ల119 నియోజక వర్గాలలో పర్యటించి ప్రజలు మన్ననలు అందుకున్ నారు. సీఎం కెసిఆర్ గారు ఇక జాతీయ స్థాయి రాజకీయాల్లో క్రియశీలక పాత్ర పోషించనున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా కేటీర్ తన మార్క్ సాధించారు.

Bio-Data of KTR 
Level of studies Institution Name Location
School St George’s Grammar School Hyderabad
Degree Nizam College Hyderabad
MSC Biotechnology University of Newyork Newyork
MBA University of Newyork Newyork

Like this Article? Subscribe to Our Poyekalam Alerts!

Leave a Reply

avatar
  Subscribe  
Notify of