ఒరిజినల్ ఆధార్ కార్డు కావాలా?

ఆధార్ కార్డు లో ఎటువంటి మార్పులు చేసిన.. కొద్ది రోజుల తర్వాత మీ సేవ కేంద్రాలకు,ఆధార్ సెంటర్స్ కి వెళ్లి మనమే డౌన్ లోడ్ చేసుకుంటాం. ఇవి కొంత నాసిరకంగా,మునుపటి వాటి తో పోలిస్తే పల్చగా ఉంటాయి . అయితే ఇక నుంచి ఆధార్ ఒరిజినల్ కార్డు నేరుగా విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ ) నుంచే పొందవచ్చు.

ఎలా ధరఖాస్తు చేయాలంటే:

1. http://resident.uidai.gov.in/aadhaarreprint వెబ్ సైట్ లోకి వెళ్లి ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి.
2. తర్వాత అక్షరాలు, అంకెలు గల సెక్యూరిటీ కోడ్ క్యాప్చ ను ఎంటర్ చేయాలి.
3. మీకు ”ఎంఆధార్ యాప్ ఉంటే అందులో ” i have totp” బాక్స్ ను సెలెక్ట్ చేసుకోవాలి.
4. టీవోటీపి లేకపోతే ”రిక్వెస్ట్ ఫర్ ఓటీపీ” బటన్ ఫై క్లిక్ చేయండి.
5. ఆధార్ తో రిజిస్టర్ అయినా నెంబర్ కి వచ్చిన ఓటీపీ ని బాక్స్ లో ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ ఫై క్లిక్ చేయాలి.
6. తర్వాత రూ.50 కట్టాల్సి ఉంటుంది.ఆధార్ కార్డు ను మీ అడ్రస్ కి యూఐడీఏఐ పోస్ట్ లో పంపుతుంది.

Like this Article? Subscribe to Our Poyekalam Alerts!

Leave a Reply

avatar
  Subscribe  
Notify of