ఐసీసీ ర్యాంకింగ్స్ లో అగ్రస్థానం లో టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.

ఆస్ట్రేలియాపై చారిత్రక టెస్టు సిరీస్ విజయం సాధించిన టీం ఇండియా, కెప్టెన్ విరాట్ కోహ్లీ ఐసీసీ ర్యాంకింగ్స్ లో అగ్రస్థానం మరింత పదిలం చేసుకున్నారు.116 పాయింట్స్ తో భారత్ నెంబర్ 1 జట్టుగా కొనసాగుతుండగా, 922 రేటింగ్ పాయింట్స్ తో విరాట్ కోహ్లీ నెంబర్ 1 బ్యాట్స్ మెన్ గా కొనసాగుతున్నాడు. సోమవారం విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్ లో భారత్ సహా కోహ్లీ అగ్రస్థానం లో కొనసాగుతున్నాడు.బ్యాట్స్ మెన్ జాబితాలో న్యూజీలాండ్ కెప్టెన్ కానే విల్లియం సన్ రెండో స్థానం లో ఉండగా, అతడిపై కోహ్లీ 25 పాయింట్స్ తో ముందంజలో ఉన్నాడు.

ప్రపంచ నెంబర్ 1 టీమ్ గా భారత్,116 పాయింట్స్ తో మొదటి స్థానం

చారిత్రక సిరీస్ విజయం లో కీలక భూమిక వహించిన ఛతేశ్వర్ పుజారా మూడో స్థానంలో నిలిచాడు.టాప్-20 లోకి అడుగుపెట్టిన యువ క్రికెటర్ రిషబ్ పంత్ కెరీర్ లో అత్యుతమ ర్యాంక్ సాధించాడు. పంత్ ప్రస్తుతం 17వ స్థానానికి చేరుకున్నారు.బౌలర్లో జాబితాలో రబడా అగ్రస్థానం లో ఉండగా, భారత్ సీమర్ బుమ్రా 15 వ స్థానాల్లో లో ఉన్నాడు.అశ్విన్, జడేజా వరుసగా ఐదు, తొమ్మిది స్థానాల్లో కొనసాగుతున్నారు.

Like this Article? Subscribe to Our Poyekalam Alerts!

Leave a Reply

avatar
  Subscribe  
Notify of