funny 1:

సరదాగా…

పెళ్ళి చూపులు…

అమ్మాయ్: ఎం చేస్తారు మీరు?

అబ్బాయ్: మా ఊర్లో చెట్టుకింద కూర్చుని కాలక్షేపం చేస్తూ ఉంటాను .
నెలకు 3000 నిరుద్యోగ భృతి వస్తుంది.
రోజుకి 100 అన్నమాట..10 రూ సమోస, రోజుకు రెండు టీ 10 రూ,3 సిగరెట్లు 30 రూ…మొత్తం 50 ఖర్చుపెడతాను. రోజుకు 50 రూ సేవింగ్ ఎకౌంట్ లో సేవ్ చేస్తాను…మీరు ఏం చేస్తారు?

అమ్మాయ్: డ్వాక్రా మెంబర్ ని.
20 వేల రుణం వస్తుంది.
సంవత్సరానికి…గత ఎన్నికల్లో అప్పారావు గారు ఇచ్చిన కుట్టు మిషన్ ఉంది…దాంతో పార్టీ జెండాలు కుడతాను. అంకుల్ ఏం చేస్తారు?

అబ్బాయ్: డాడీకి వ్రద్దాప్య పింఛన్ 1000 వస్తుంది…ఈసారి వాళ్ళు 2000 ఇస్తామంటున్నారు. వారికి ఒటేద్దామనుకుంటున్నాం. మీ డాడీ ఎం చేస్తారు…?

అమ్మాయ్: ఆ…మా డాడీ మాత్రం కలెక్టరా? ఆయనకి 1000 పింఛన్ వస్తుంది.
1000 కి ఏం వస్తుంది ఈ రోజుల్లో? 2000 ఇస్తే వారికి ఓటేద్దాం అనుకుంటున్నాం.

అబ్బాయ్: ఆంటీ ఎం చేస్తారు?

అమ్మాయ్: అమ్మ నగలు బ్యాంక్ లో పెట్టాం.
బాబు రుణం మాఫీ చేస్తానని చెప్పాడు. ఇంతవరకు చెయ్యలేదు. బ్యాంక్ వారు నగలు వేలం వేస్తామంటున్నారు. మమ్మీ ఏడుస్తూ కూర్చుంది.
మీ మమ్మీ ఏం చేస్తుంది?

అబ్బాయ్: మీ మమ్మీలాగే మా మమ్మీ…సేం టూ సేం…

అమ్మాయ్: ఇళ్లు సొంతదేనా?

అబ్బాయ్: మా అమ్మమ్మ ఇందిరమ్మ ఇచ్చిన ఇల్లు…ఈసారి గెలిస్తే…మరొక గది వేసుకోటానికి 2 లచ్చలు ఇస్తారట. దాంతో బైక్ కొందామనుకుంటున్నా? మీ ఇల్లు ఓనా?

అబ్బాయ్: ఓ…కంగ్రాట్ష్యులేషన్స్…మీరు నాకు నచ్చారు. ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందాం?..నేను రోజు సేవింగ్ చేసే 50 రూపాయలు..నెలకు 1500 నీ చేతిలో పెడతా…నీ ఇష్టం వచ్చినట్లు వాడుకో…ఎంజాయ్…

అమ్మాయ్: నాకు పక్క రాష్ట్రం ఎన్నికలు అయ్యేవరకు టైం కావాలి…పక్క రాష్ట్రం అబ్బాయ్ సంబంధం ఒకటి వచ్చింది…ఎన్నికలు అయ్యాక వాళ్ళ రాష్ట్రంలో పదెకరాల పొలం..10 వేలు నిరుద్యోగ భృతి ఇస్తారట…విల్లా కూడా ఒకటి ఇస్తారట

funny 2:

ఆపద్ధర్మ ముఖ్యమంత్రి KCR తో…ఇంటర్వ్యూ..

ప్రశ్న : దళితుడిని…ముఖ్యమంత్రి ఎందుకు
చెయ్యలేదు…?
జవాబు : 3 ఎకరాలు ఇద్దామని

ప్రశ్న : మరి ఎందుకు ఇవ్వలేదు..?
జవాబు : డబుల్ బెడ్ రూమ్ ఇద్దామని

ప్రశ్న : అది కూడా ఇవ్వలేదు కదా…?
జవాబు : ఇంటికో ఉద్యోగం ఇస్తే..వాళ్ళే
కట్టుకుంటారని ఇవ్వలేదు..

ప్రశ్న : మరి ఉద్యోగాలు కూడా లేవుకదా..?
జవాబు : KG to PG ఇచ్చి…వారికి ట్రైనింగ్ ఇచ్చాక ఇస్తాం…

ప్రశ్న : ఎప్పటి నుంచి ప్రవేశపెడతారు…?
జవాబు : బంగారు తెలంగాణా అవగానే…

ప్రశ్న : ఎపుడు అవుతుంది….?
జవాబు : ప్రాజక్ట్ లు… పూర్తవగానే…

ప్రశ్న : ప్రాజక్ట్ లు…ఎప్పుడు పూర్తవుతాయి..?
జవాబు : చంద్రబాబు..కుట్ర చేస్తున్నాడు

ప్రశ్న : మరి…మీరేం చేస్తున్నారు…?
జవాబు : మిషన్ భగీరధ ద్వారా..ఇంటింటికీ నల్లా ఇస్తున్నాం…

ప్రశ్న : ఎక్కడా రావటం లేదు కదా….?
జవాబు : మిషన్ కాకతీయ…పూర్తవగానే చెరువులు నిండి…నీరు పుష్కలంగా అందుబాటులోకి వచ్చాక…

ప్రశ్న : మిషన్ కాకతీయ ఎందుకు పూర్తి చేయలేక పోయారు..?
జవాబు : అక్రమ కట్టడాలు తొలగించాలి….

ప్రశ్న : అక్రమ కట్టడాలు తొలగించలేదు కదా…?
జవాబు : ఆంద్రోళ్ళు గోలపెడతారని….

ప్రశ్న : వాళ్ళని తెగ తిడుతున్నారు కదా…?
జవాబు : లే..నేనెందుకు తిడతా…నాకేమన్నా
పిచ్చా….వాళ్ళ కాళ్ళలో…ముల్లు
గుర్చుకుంటే పంటితో తీస్తా…..

ప్రశ్న : మరి…వాళ్ళే తెలంగాణా ద్రోహులు
అంటారుగా…?
జవాబు : ఉద్యమం సమయంలో…లక్ష అంటాం..

ప్రశ్న : లక్ష అంటే గుర్తొచ్చింది….రామోజీ పిల్మ్
సిటీని..లక్ష నాగళ్ళతో
దున్నుతామన్నారుగా..?
జవాబు : అన్ని ట్రాక్టర్లు దొరకలా…ఎన్ని ఉన్నాయో
లెక్క వేద్దామని…కొంగరకలాన్ ల మీటింగ్
కి ట్రాక్టర్ ర్యాలీ పెట్టించా….లచ్చ రాలేదు…

ప్రశ్న : మరి తరువాత మీ ప్రోగ్రాం….?
జవాబు : ట్రాక్టర్లు లేకపోతే ఏమయింది…ఇంటింటికీ బర్రెలు, గొర్రలు ఇచ్చాం….వాటిని అక్కడకి తోలి రా.పిల్మ్.సిటీని స్వాదీనం చేసుకుంటాం.

ప్రశ్న : బర్రెలు, గొర్రెలు…ఇవ్వటంలో ఆంతర్యం..?
జవాబు : ఇంకా అర్దం కాలేదా…..హ….హ…

Like this Article? Subscribe to Our Poyekalam Alerts!

Leave a Reply

avatar
  Subscribe  
Notify of