Image source from funzug

ఎన్నికల వేళా సరదా వ్యాఖ్యలు 2 వెర్షన్:

దోస్త్: ఎం సంగతిర రాజా ఎం జేస్తున్నవ్
నేను: ఎం లేదుర ఇగ లగ్గం జేసుకుంటున్న పెండ్లి కారేట తీస్కో
దోస్త్: అగొ నువ్వు లైఫ్ల సెట్ అయ్యేదాక లగ్గం జేసుకొను అంటివి గదరా
నేను:అనుకున్న గని ఇగ నేను లైఫ్ల సెట్ అయినట్టే అనిపిస్తంది
దోస్త్:అగొ గదెట్లరా నువ్వు ఎం జేస్తనేలేవ్ గదా
నేను: ఇగ నేను ఎం జేసుడు అవసరం లేదు రా
దోస్త్: ఎం జేయకపెయిన నీకు పిల్లని ఎట్లా ఇస్తుర్రురా
నేను: మొన్న పూలుపండ్లకి(ఎంగేజ్మెంట్)పోయిన అక్కడ నాకు కాబోయే భార్యతో అత్తమామలతో మాట్లాడిన
దోస్త్:ఎం మాట్లాడినవ్ రా
నేను: మా అత్తమామలతో ఇగో ఇనుర్రి ఇగ ఈ రోజుల్లో ఉద్యోగం అనే మాట మర్షిపోర్రి.

మనకి ఉద్యోగం జేయాల్సిన అవసరం లేదు
మా అత్తమామ నాకు కాబోయే భార్య గట్ల ఎట్ల అని ఆడిగిర్రు
దానిని నేను బదులుగా
#నాకు నిరుద్యోగ భృతి 3000
#నీ బిడ్డకి నిరుద్యోగ భృతి 3000
#మా అయ్యకి పింఛను 2016
#మా అవ్వకి పింఛను 2016
#పంటకు 10000 రైతు బంధు(అంటే నెలకి 1700)
#మొత్తం నెల సంపాదన మా ఇంట్లో దగ్గర దగ్గర 13000 ఉంది
#నెలకి అగ్గో రేట్ల రేషన్ దుకాండ్ల 300 రూపాల్ల 25 కిలల బియ్యం మరియు పప్పులు, ఉప్పులు,షెక్కరి,షాయపత్తా అన్ని ఆస్తయి కాబట్టి బట్ట పొట్టకి ఇబ్బంది లేదు.

ఎన్నికల వేళా సరదా వ్యాఖ్యలు 2 వెర్షన్:

మంచిగా అవ్వే పైసలతోని
మా అయ్యకి రోజు అడుకపు బింకి,నాకు రోజుకు ఒక బీర్ అండ్ల స్టఫ్ కు రోజుకి ఒక కారపొట్లం,వారంవారం అద్దకిల షికేన్ లేదా మటన్ తోని పుర్సత్ గా అందరం మంచిగా తింటాం తాగుతం.
మా అవ్వకు,భార్య నెలకి ఒక చీర కొనిస్తా మల్ల పండగలకి కూడా సర్కార్ షీరలు,పెళ్లికి కట్నం,పిల్లలు పుట్టిన ఫ్రీ గా డెలివరీ మల్ల పుట్టిన పొరనికో పోరికో మీది కెళ్లి పైసలు ఇయ్యనేవట్టే
ఇక జెప్పుర్రి మీరు మీ బిడ్డను నాకు ఎందుకు ఇయ్యరో
అపుడు మా అత్తమామలు జెప్పన లేషి శబ్బాష్ అల్లుడు మా బిడ్డని నీకే ఇచ్చి లగ్గం జేస్తం అని ఒప్పుకొని పూలుపండ్లు జేసి లగ్గంకి గడియ బెట్టిర్రు
దోస్త్:ఓరిని ఇంత ఉందారా సరే గని మరి నువ్వు ఎమ్ జేస్తవ్ ఇక ముందు ఎం లేదు ఎట్ల ప్రభుత్వం నన్ను నా కుటుంబాన్ని సాదుద్ది కావట్టి నేను నా కుటుంబం రోజు ఊపిరి(శ్వాస) పీల్చుతూ వదులుతూ బతుకుతం
దోస్త్:ఇగ లాభం లేదు రా నేను గుడా నీలెక్కనే జేస్తర బై
నేను: సరే నా లగ్గం కు రారా
దోస్త్:తప్పక వస్తా నా లగ్గం కారేట బట్టుకొని వచ్చి నీకు నీ లగ్గంల ఇస్తా
నీ లగ్గం ఐనంక నువ్వు నా లగ్గం రావాలే
నేను: సరే ర తప్పక వస్తా
ఇలా నేను మత్తుకు,సుఖానికి బానిసనై పిల్లల్ని కంటా వాళ్ళని గుడా గిట్లనే పెంచుతా
వాళ్ళు గుడా గిట్లనే తయారు ఐతరు
ఇంకో దిక్కు రాజ్యాల్ని ఏలేవాడి కొడుకు తరువాత వాడికొడుకు ఇలా రాజ్యాలు ఏలుతునే ఉంటరు నేను నా భవిష్యత్ తరాలు ఇలాగే బానిసత్వంలో పడి ఉంటాo. మీ ప్రియ నేస్తం

Like this Article? Subscribe to Our Poyekalam Alerts!

Leave a Reply

avatar
  Subscribe  
Notify of